పాక్ జైల్లో గాయపడ్డ సరబ్‌జిత్ సింగ్ బ్రెయిన్ డెడ్?

సరబ్‌జిత్ సింగ్‌కు అత్యుత్తమైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్లు పాకిస్థాన్ సోమవారం వెల్లడించింది. జిన్నా ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ షౌకత్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం నిరంతరం సరబ్‌జిత్ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు. సరబ్‌జిత్‌ను జిన్నా ఆసుపత్రి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలను సమాచార మంత్రి అరిఫ్ నిజామీ కొట్టి పారేశారు.
అలాంటి ప్రతిపాదనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం సరబ్‌జిత్‌ను ఆసుపత్రిలో కలిసిన అతని కుటుంబ సభ్యులు సరబ్‌జిత్ పరిస్థితి అతి దయనీయంగా ఉందని తెలిపారు. సరబ్‌జిత్ పొట్ట ఉబ్బిందనీ, ముఖం వాచిందనీ సోదరి దల్బీర్ కౌర్ వెల్లడించారు.
కాగా, సరబ్‌జిత్‌ను అంతమొందించాలనుకున్నట్లు ఇక్కడి కోట్ లఖ్‌పత్ జైలులో అతనిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరచిన కేసులో ప్రధాన నిందితులు అమర్ అఫ్తాబ్, ముదస్సర్‌లు విచారణలో వెల్లడించారు. 1990లో లాహోర్‌లో బాంబు దాడులు జరిపి 14 మంది పాకిస్థాన్ పౌరుల ప్రాణాలు తీసినందుకే వారు సరబ్‌జిత్ ప్రాణాలు తీయాలనుకొన్నట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (జైళ్లు) మాలిక్ ముబాషిర్ ఈ మేరకు ప్రాథమిక నివేదిక సమర్పించారు.












Click it and Unblock the Notifications