కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబునే వైయస్ ఫాలో అయ్యారు!: సిఎంకు విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్/కడప: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లాగే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి భూకేటాయింపులు జరిపారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం అన్నారు. మేడే సందర్బంగా బుధవారం విజయమ్మ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరులోనే శ్రామికులను చేర్చామన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇరవై లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కరెంట్ కోతలతో ఫ్యాక్టరీలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైయస్ పాలన సాగిందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీరుతాయని ఆమె హామీ ఇచ్చారు.

చంద్రబాబు తన హయాంలో ఏ ప్రాతిపదిన భూములు కేటాయించారో వైయస్ అలాగే కేటాయించారన్నారు. అలాంటప్పుడు ఆరోపణలు కేవలం వైయస్ పైనే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఇసూజీ కార్ల కంపెనీకి ఏ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం రాయితీ కల్పించిందో చెప్పాలన్నారు. 130 శాతం రాయితీ ఇవ్వడం వెనుక క్విడ్ ప్రోకో జరిగిందా చెప్పాలన్నారు. వైయస్ పథకాలకు పేర్లు మార్చి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రయివేటీకరణ అంటే చాలా ఇష్టమన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను ఆయన తన హయాంలో దివాళా తీయించారన్నారు. తెలుగు తమ్ముళ్లకు ప్రయివేటు సంస్థలను అప్పగించారని మండిపడ్డారు.

English summary
YSR Congress party honoarary president YS Vijayamma has questioned CM Kiran Kumar Reddy over land allotments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X