చంద్రబాబు ప్రపంచ రికార్డ్స్: యాత్రపై జగన్ పార్టీ ఎద్దేవా

కాంగ్రెసు పార్టీతో చంద్రబాబు మిలాకత్ అయ్యారన్నారు. అలాగే వస్తున్నా పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు నాయుడు అనేక ఘనకార్యాలు సాధించారన్నారు. అవన్నీ ప్రపంచ రికార్డుల్లో నమోదు చేయదగ్గవేనని చురకలు అంటించారు. అధికార పార్టీతో కలిసి చంద్రబాబు మాయా కూటమిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు.
శాసనసభలో అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండి.. అధికార పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని నిలబెట్టారని ఆరోపించారు. వస్తున్నా మీకోసం సమయంలో బాబు యాత్ర రాజుగారి విహార యాత్రలా మారిందన్నారు. 2014 ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెసుతో కలిసి కూటమి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
పాదయాత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరారన్నారు. పాదయాత్రకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు యాత్ర తర్వాత తెలుగు - కాంగ్రెసు నేతగా మారి రికార్డ్ సృష్టించారని నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications