ముషారఫ్‌కు షాక్: ఎన్నికల్లో పోటీపై జీవిత కాలం బ్యాన్

స్వీయ అజ్ఞాతంనుంచి సొంతగడ్డకు వచ్చి మరీ బోనులో చిక్కినట్లయింది. ఈ మేరకు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తూ మంగళవారం పెషావర్ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. మరో కోర్టు ముషారఫ్‌కు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది.
సార్వత్రిక ఎన్నికలు మే 11న జరగనుండగా ఆ తరువాత మూడు రోజులు కూడా ఆయన కస్టడీ లో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. బేనజీర్ భుట్టో హత్య కేసులో ఆయనకు ఉగ్రవాద నిరోధక కోర్టు ఈ కస్టడీ విధించింది. తన నామినేషన్‌ల తిరస్కరణను సవాల్ చేస్తూ ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్‌ను పెషావర్ హైకోర్టు తోసిపుచ్చింది. ఇక ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా చీఫ్ జస్టిస్ దోస్త్ మహ్మద్‌ఖాన్ నేతృత్వంలోని బెంచ్ నిషేధం విధించింది.
2007 ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగాన్ని రెండుసార్లు రద్దు చేసి, జడ్జిలను ఖైదు చేసినందుకే ఈ నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. జాతీయ, ప్రొవిన్షియల్ అసెంబ్లీలు, సెనేట్.. వేటికీ ముషారఫ్ పోటీ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఇక సార్వత్రిక ఎన్నికల రోజునా ముషారఫ్‌కు గృహ నిర్బంధం తప్పలేదు.












Click it and Unblock the Notifications