హేట్ స్పీచ్: అక్బరుద్దీన్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్

ఈ నెల 9వ తేదిన అక్బరుద్దీన్ ఓవైసీని కోర్టులో హాజరు పర్చాలని రాష్ట్ర రాజధాని హైదరాబాదు పరిధిలోని మాదన్నపేట పోలీసులను న్యాయస్థానం గురువారం ఆదేశించింది. అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నమోదైన కేసు నేపథ్యంలో కోర్టు వారెంట్ జారీ చేసి, పోలీసులను ఆదేశించింది.
కాగా, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గత ఏడాది డిసెంబర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అక్బరుద్దీన్ పైన దేశవ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో అతను నెల రోజులకు పైగా జైలులో కూడా ఉన్నారు. అనంతరం బెయిల్ పైన విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా అతనిపై పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి.
సిఐడి ముందు హాజరైన శంకర రావు
మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు గురువారం సిఐడి ముందు హాజరయ్యారు. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో శంకర రావును సిఐడి మంగళవారం అరెస్టు చేసి, ఆ తర్వాత బెయిల్ పైన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రతి గురువారం తమ ఎదుట హాజరు కావాలని సిఐడి ఆదేశించడంతో శంకర రావు ఈ రోజు వచ్చారు.












Click it and Unblock the Notifications