రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లికి నిరాకరించిందని యువతి గొంతు కోసిన ఉన్మాది

By Pratap
|
Google Oneindia TeluguNews

youth attacks girl in Rangareddy district
హైదరాబాద్: పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు యువతి గొంతు కోసిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలస్‌స్టేషన్ పరిధి ఎలిమినేడు అటవీకంచెలో బుధవారం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ నివాసి అయిన వి.సౌజన్యరేఖ(27) హకీంపేట్‌లో ఆర్టీసీ ట్రాఫిక్ ట్రెయినీ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తోంది. ఆమెకు దూరపు బంధువైన ఇబ్రహీంపట్నం మండల పరిధి తుర్కగూడ గ్రామానికి చెందిన మాల్‌లోని పీఎంఆర్ పీజీ కళాశాలో మొదటి సంవత్సరం చదువుతున్న మద్దెల విజయ్(22)తో ఏడాదిన్నరగా చనువుగా ఉంటోంది.

విజయ్‌ను కాదని ఈ యువతి వేరొకరిని పెళ్లాడేందుకు ఇటీవల నిర్ణయించుకుంది. ఇదే విషయమై చర్చించుకునేందుకని బుధవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంకు రాగా విజయ్ ఆమెను మోటార్‌ సైకిల్‌పై ఎక్కించుకొని ఎలిమినేడు ఫారెస్టులోకి తీసుకెళ్లాడు. అక్కడ వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపాన్ని తట్టుకోలేక విజయ్ తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో యువతి గొంతుపై, ఎడమచేయి మణికట్టుపై కోశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

రక్తపు మడుగులో పడి ఉన్న సౌజన్యను పక్కనే పొలం పనులు చేసుకుంటున్న రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాధిత యువతిని మోటార్ బైక్‌పై మధ్యవరకు తీసుకువచ్చి ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌లో ఎక్కించి ఇబ్రహీంపట్నం సివిల్ ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స జరిపిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని నగరంలోని బైరామల్‌గూడ ఆవేర్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

English summary

 Youth attacked girl for rejecting marraige proposal with him. This incident occured in the Ibrahimpatnam police station limits in Rangareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X