వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదేళ్ల బాలుడి కాల్పులు: రెండేళ్ల చిన్నారి చెల్లె మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Girl
కెంటుకి: అమెరికాలోని కెంటుకిలో దారుణం జరిగింది. వంటగదిని శుభ్రం చేస్తున్న స్టీఫెనీకి రైఫిల్ పేలిన శబ్దం వినిపించింది. ఏమైందో చూసేలోగా తన రెండేళ్ల కూతురు మరణించింది. ఐదేళ్ల కుమారుడు రైఫిల్‌ నుంచి గుండ్లు దూసుకెళ్లి ఆ చిన్నారి ప్రాణాలు తీసింది. నిరుడు బహుమతిగా కొనిచ్చిన రైఫిల్‌తో ఆ బాలుడు ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. మంగళవారం జరిగిన ఆ సంఘటన అమెరికాను దిగ్భ్రాంతికి గురి చేసింది.

స్టీఫెనీ ఐదేళ్ల కుమారుడు క్రిస్టియన్ చేతిలోని రైఫిల్ పేలి ఆమె కూతురు కరోలిన్ ఛాతిలో గుండు దూసుకెళ్లింది. దాంతో ఆ అమ్మాయి అసువులు బాసింది. క్రిస్టియన్ రైఫిల్‌ను మొబైల్ హోమ్‌లోని ఓ మూలలో పెట్టారు. దాంట్లో బుల్లెట్లు ఉన్న విషయాన్ని గమనించలేదు.

కెంటుకిలో తరాల నుంచి తరాలకు అందుతాయని, చిన్న వయస్సు నుంచే అక్కడ గన్‌లతో పరిచయం ఏర్పడుతుందని, వేటకు తదితరాలకు వాడుతారని కుంబర్లాండ్ కౌంటీ కరోనర్ గారీ వైట్ చెప్పారు. పిల్లల కోసం గన్‌లు తయారు చేసే కంపెనీ దాన్ని తయారు చేసిందని వైట్ చెప్పారు.

గన్‌లు కలిగి ఉండడమనేది కెంటుకీకి మాత్రమే పరిమితం కాదని, అమెరికా గ్రామీణ ప్రాంతాలంతటా విస్తరించి ఉందని, వేటకు, షూటింగ్‌కు, స్పోర్ట్ ఫిషింగ్‌లకు వాటిని వాడుతారని అన్నారు. గన్‌లుండని ఇళ్లు అంటూ ఉండదని అంటున్నారు. వివిధ జంతువులను చంపి వాటిని గర్వంగా ప్రదర్శించే చిత్రాలను కుంబర్లాండ్ కౌంటీలో వార్తాపత్రికలు ప్రచురిస్తుంటాయని చెప్పారు.

English summary
Kentucky, where some children get their first guns even before they start first grade, Stephanie Sparks was cleaning the kitchen as her 5-year-old son played with the small rifle he was given last year. Then, as she stepped onto the front porch, "she heard the gun go off," a coroner said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X