చిరంజీవి ఉన్నత స్థానంలో ఉండాలి: దాసరి కామెంట్

చిరంజీవిని తాను ఉన్నతస్థానంలో చూడాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతానికి రాజకీయాల పైన తనకు ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా పట్టుబడితే రాజకీయాల్లోకి వెళతానేమో కానీ, ఇప్పటి మాత్రం రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానన్నారు. గత కొంతకాలంగా తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు ఆశావంగా, ఆరోగ్యకరంగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంగ్రెసు పార్టీలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆయన కొద్ది నెలల క్రితం వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేంద్రమంత్రి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పటి నుండి దాసరి నారాయణ రావు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది.
చిరంజీవి కాంగ్రెసు పార్టీలోకి రావడంతో దాసరి ఆయన శిష్యుడుగా ముద్రపడ్డ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరిగింది. ఈ సమయంలో చిరంజీవిని అత్యున్నత స్థాయిలో చూడాలని కోరుకుంటున్నానని దాసరి చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications