పెదవి విప్పని కొండా సురేఖ..!: చాడతో జగన్ భర్తీ?

ఈ కోవలో మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్, మేకపాటి సోదరులు, కొండా దంపతులు వంటి నేతలు సైతం ఉన్నారు. అధిష్టానం కల్పించుకొని మేకపాటి సోదరుల అసంతప్తిని చల్లార్చిందని అంటున్నారు. మారెప్ప, రెహ్మాన్ వంటి నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వచ్చినప్పటికీ వారు వాటిని ఖండించారు. మారెప్ప విషయం ఎలా ఉన్నా రెహ్మాన్ అసంతృప్తికి గురైనప్పటికీ ఆ తర్వాత అధిష్టానం బుజ్జగింపులతో చల్లబడ్డారట.
అసంతృప్తికి గురైన పలువురు నేతలు అధిష్టానం బుజ్జగింపులతో చల్లబడుతూ... తమకు అసంతృప్తి లేదని మీడియాకు చెబుతున్నారు. అయితే, కొండా దంపతుల అసంతృప్తిపై ఇన్నాళ్లుగా చర్చ సాగుతున్నా వారు బయటకు రాకపోవడంతో పార్టీని వీడాలనే అభిప్రాయానికి వచ్చినందువల్లే అంటున్నారు. గతంలో కొండా సురేఖ అసంతృప్తి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయని, అప్పుడు ఆమె బయటకు వచ్చి వివరణ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
మరోవైపు హన్మకొండ మాజీ పార్లమెంటు సభ్యులు చాడ సురేష్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. కొండా సురేఖ పార్టీకి దూరమైన పక్షంలో ఆమె స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున చాడ సురేష్ రెడ్డి భర్తీ చేయవచ్చునని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications