దాడిని వద్దని చెప్తాం: పెదబాబు, జగన్ ఇష్టం: కొణతాల

గత ఎన్నికలలో దాడి వీరభద్ర రావు పోటీ చేస్తే ధరావత్తు కూడా దక్కలేదన్నారు. ఆయన తమ పార్టీలోకి వచ్చి కొత్తగా ఉద్దరించేదేమీ లేదన్నారు. దాడి రాకను తాము వ్యతిరేకిస్తున్న విషయాన్ని, తమ అభ్యంతరాలను పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
అసంతృప్తితోనైనా... సర్దిచెప్పిన కొణతాల
తాము పదవులు ఆశించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రాలేదని, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని కొణతాల రామకృష్ణ అన్నారు. పార్టీకి ఏది ఉపయోగపడుతుందో జగన్‌కు తెలుసునని, జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.
కార్యకర్తలను నమ్ముకున్న పార్టీ టిడిపి
తమ పార్టీ కార్యకర్తలను నమ్ముకున్న పార్టీ అని తెలుగుదేశం పార్టీ నేత మండవ వెంకటేశ్వర్లు అన్నారు. దాడి వీరభద్ర రావు పార్టీని వీడినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదన్నారు. పదవులు రాలేదని పార్టీని వీడుతానంటే ఎలా అని ప్రశ్నించారు. అలాంటి వారి వెంట తమ పార్టీ కార్యకర్తలు వెళ్లరన్నారు.
గతంలో జగన్ పార్టీన దొంగల పార్టీ, జైలు పార్టీగా అభివర్ణించిన దాడి వీరభద్ర రావు ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరుతున్నారని మరికొందరు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ముప్పయ్యేళ్లు టిడిపిలో ఉండి కాంగ్రెసు పార్టీ పైన, వైయస్ రాజశేఖర రెడ్డి పైన పోరాడిన దాడి జగన్ పార్టీలో చేరడం విడ్డూరమంటున్నారు.












Click it and Unblock the Notifications