నిత్య పెళ్లికొడుకు: టెక్కీనని చెప్పి ఆరుగురితో పెళ్లి

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌కు చెందిన వినోద్ అలియాస్ వినోద్‌రెడ్డి అలియాస్ వినోద్‌కుమార్ అలియాస్ వినోద్‌నాయక్ (33) ఇన్ఫోసిస్‌లో క్యాషియర్‌గా పని చేసేవాడు. తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని చెప్పి ఇంటర్నెట్‌లో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2కు చెందిన యువతి (22)ని పరిచయం చేసుకున్నాడు. ఆరు నెలల్లో వారి పరిచయం ప్రేమగా మారింది. యువతి తల్లిదండ్రులు వాళ్ల ప్రేమను అంగీకరించి పెళ్లి చేశారు.
పెళ్లి సమయంలో 20 తులాల బంగారు ఆభరణాలు, పది లక్షల రూపాయల నగదును కట్నంగా ఇచ్చారు. నెల రోజులపాటు వారి కాపురం బాగానే సాగింది. ఆ తరువాత వినోద్ ముఖం చాటేసాడు. అతని కోసం యువతి అనేక చోట్ల గాలించింది. చివరికి తాను మోసపోయిన్నట్టు తెలుసుకొని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని గురించి విచారించారు. అతడు ఇలాగే ఆరుగురిని వివాహం చేసుకున్నట్టు తేలింది. గురువారం నిందితుడిని అరెస్టు చేసి 506,509 సెక్షన్ కింద కేసు నమో దు చేశారు. రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications