వడ్డికాసులవాడు: జగన్‌కు దాసరి దూరమా?

వడ్డికాసులవాడు సినిమాలో వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూరీడు పాత్ర ప్రధానంగా ఉంటుందని చెబుతున్నారు. దాసరి నారాయణరావు ఈ పాత్రను పోషిస్తున్నట్లు కూడా చెప్పారు. ఈ సినిమాకు దాసరి నారాయణరావు తన జన్మదినం సందర్భంగా శనివారం శ్రీకారం చుట్టారు. దాసరి నారాయణ రావు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని గత కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.
వడ్డికాసులవాడు సినిమా వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అటువంటప్పుడు దాసరి నారాయణ రావు జగన్ పార్టీలో చేరడానికి అవకాశం ఉండదని అంటున్నారు. కాంగ్రెసు పార్టీలోకి చిరంజీవి ప్రవేశించిన తర్వాత దాసరి నారాయణరావు ఆ పార్టీకి దూరమయ్యారని, అందువల్ల ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి.
వడ్డికాసులవాడు సినిమాలో వైయస్ రాజశేఖర రెడ్డిని లక్ష్యం చేసుకుంటారా, ఆయన చుట్టూ ఉన్నవారని లక్ష్యం చేసుకుని, వైయస్ రాజశేఖర రెడ్డిని అమాయుకడిగా చూపిస్తారా అనే చర్చ సాగుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డిని అమాయకుడిగా చూపించడానికి దాసరి నారాయణ రావు నిర్ణయించుకుంటే జగన్ పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. అయితే, సినిమా విడుదలైతే గానీ ఆ విషయం తెలియదు.
కాగా, సూరీడు పాత్రను పెడుతున్న దాసరి నారాయణ రావు సినిమాలో వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు పాత్రను ఎలా తీర్చిదిద్దుతారనే ఆసక్తి కూడా నెలకొని ఉంది. సినిమాలో తప్పకుండా కెవిపి రామచందర్ రావు పాత్ర ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వంలోని పైస్థాయి అవినీతిని ఎండగట్టేందుకు దాసరి నారాయణ రావు ఈ సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, వడ్డికాసులవాడు సినిమా పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications