వాంఖడేలోకి వెళ్తే షూట్ చేస్తారా: షారూఖ్ ఖాన్

తాను గొడవ పడలేదని, గొడవ పడాలనే ఆలోచన కూడా రాలేదని, చాలా ప్రశాంతంగా ఉందని ఆయన అన్నారు. వాంఖడే స్టేడియంలో మే 7వ తేదీన జరిగే మ్యాచు విషయంపై ప్రస్తావించగా, రాజకీయంగా తప్పుగా మాట్లాడదలుచుకోలేదు గానీ వాంఖడేలోకి అడుగు పెడితే తనను కాల్చేస్తారా అని ఆయన అడిగారు.
అధికారులు గుర్తించకుండా తాను ముసుగు ధరిస్తానని ఆయన హాస్యమాడారు. మీసాలు పెట్టుకుంటానని, మారు వేషం లాంటిది వేస్తానని, అయితే తాను ఏ విధమైన అవకాశం తీసుకోదలుచుకేలదని, తాను మైదానం వెలుపల ఉండి, తన బాయ్స్‌ని ఉత్సాహపరుస్తానని షారూక్ ఖాన్ అన్నారు.
తన జట్టును వాంఖడేలోకి అడుగు పెట్టినిస్తే ఏ విధమైన ఇబ్బంది లేదని, తాము మ్యాచును గెలుస్తామని, మ్యాచు గెలవడానికి తాను అక్కడ ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. టీమ్ హోటల్‌లో రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ విధంగా అన్నారు.
నిజానికి, ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి కోల్‌కతా నైట్ రెడర్స్ డ్రెసింగ్ రూంలోకి షారూక్ ప్రవేశించారు. అలా ప్రవేశించడం తన తప్పిదమేనని ఆయన అన్నారు. కొన్ని సార్లు తాను నిబంధనలను మరిచిపోతానని ఆయన అన్నారు. మళ్లీ ఈ తప్పిదం చేయనని అన్నారు.












Click it and Unblock the Notifications