జగన్ కోసం కొల్లగొట్టిన వైయస్, హామీలు అంతే: హరీష్

వైయస్ సీఎం అయ్యాక జగన్ కోసం ఆస్తులు కొల్లగొట్టే పనిలో పడ్డారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు వ్యవస్థను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారన్నారు. అది సరిదిద్దుతానని చెప్పిన వైయస్ నిర్వాకంతో వేలాది కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి సమన్వయం లేదన్నారు. వైయస్ ఉన్నపుడు వైద్య, ఆరోగ్య శాఖను విభజించడంతో ఇప్పటికీ మూడు ముక్కలాటగా మిగిలిందని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు తెరాస పోరాడుతోందన్నారు.
మరోవైపు బయ్యారం వ్యవహారంలో తనను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తెరాస అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రగిలిపోతున్నారట. కెసిఆర్ అంటే ఏమిటో చూపిస్తానని ఇప్పటికే అన్న ఆయన.. బయ్యారంపై సెగ రాజేసే దిశలో వెళ్తున్నారట.












Click it and Unblock the Notifications