పార్టీ నాశనం: కొణతాల వర్గం, అందుకే ఆగానన్న దాడి

సుమారు మూడు దశాబ్దాలపాటు తెలుగుదేశం పార్టీలో పలు పదవులు అనుభవించి, అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు పదవీ దాహంతో జగన్ పార్టీలోకి వచ్చారని విమర్శించారు. 1983లో ఆయన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఏమిటి? అనే విషయం గమనించాల్సి ఉందన్నారు. టిడిపి అధికారంలో ఉండగా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, కొణతాల రామకృష్ణ ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదన్నారు.
2009లో ఎన్నికల్లో ఆయన ఓడినప్పటికీ వైయస్ పదవి ఇస్తానన్నప్పటికీ.. సున్నితంగా తిరస్కరించారని కానీ, దాడి తన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసి 24 గంటలు గడవకముందే జగన్ వద్దకు వెళ్లి పదవికోసం బేరం పెట్టారని విరుచుకు పడ్డారు. దాడి అనుంగు అనుచరులంతా టిడిపిలోనే ఉన్నారని... ఆయన అటు వైయస్సార్ కాంగ్రెసు, ఇటు తెలుగుదేశం పార్టీలతో రాజకీయాలు చేసే అవకాశం ఉందన్నారు.
బాబును ఇబ్బంది పెట్టవద్దనే...
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయనను ఇబ్బంది పెట్టవద్దనే జగన్ పార్టీలోకి వెళ్లే నిర్ణయాన్ని ఆలస్యంగా ప్రకటించారట. నెల క్రితమే జగన్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. పాదయాత్ర సమయంలో ఇబ్బంది పెట్టవద్దనే ఆగారట. తనకు జగన్ పార్టీయే ప్రత్యామ్నాయం అన్నారు.












Click it and Unblock the Notifications