భార్య కోసం కుక్కను కరిచాడు: యువకుడిపై అత్యాచారం

 Man bites dog in bizarre incident in Chicago
చికాగో/: ఓ వ్యక్తి కుక్కను కరిచిన ఘటన అమెరికాలో జరిగింది. కుక్కను కరవడంతో ఆ వ్యక్తి వార్తల్లోకెక్కాడు. తన భార్యను ఓ కుక్క నుండి కాపాడుకోవడానికి అతడు దానిపై ఎదురుదాడి చేసి కరిచాడు. అతడి పేరు లెయిన్ హెన్రీ. అతని ఊరు ఐయావాలోని మాడ్రిడ్. అతడి భార్య కరేన్ హెన్రీ తమ పెంపుడు కుక్క క్యాండీతో వాకింగ్‌కు వెళ్తుండగా దాదాపు 25 కిలోల బరువున్న లాబ్రడార్ కుక్క ఒకటి దాడి చేసింది.

పక్కనుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కరేన్ మీదకు దూకి ఆమె ముఖం, తొడ, పొత్తికడుపు భాగాల్లో తీవ్రంగా గాయపరిచింది. తర్వాత క్యాండీపై పడింది. వెనకాలే కారులో వస్తున్న లెయిన్.. ఈ దాడిని చూసి కారును ఆపేసి, గబగబా కారులోంచి దిగి ఆ కుక్కతో తలపడ్డాడు. దాన్ని గట్టిగా కొట్టడంతో పాటు ముక్కు భాగాన్ని కొరికేశాడు. దీంతో ఆ కుక్క అక్కడి నుండి పారిపోయింది.

అనంతరం కరేన్‌ను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ఆమె ముక్కు తీవ్రంగా దెబ్బతింది. దాన్ని పూర్వస్థితికి తేవడానికి వరుసగా కొన్ని సర్జరీలు చేయాల్సి ఉంది. చెవి నుంచిగానీ, శరీరంలో ఇతర భాగాల నుంచిగానీ మృదులాస్థిని తీసుకుని ఈ సర్జరీలు చేయాల్సి ఉంది. మరోవైపు కుక్కతో పోరులో లెయిన్‌హెన్రీకి కూడా గాయాలయ్యాయి. కుక్క అతడి చేతిని గాయపరచడంతో ఇన్‌ఫెక్షన్ సోకింది. తాను చలువ కళ్లద్దాలు ధరించకపోయి ఉంటే ఈ దాడిలో తన చూపు పోయి ఉండేదని కరేన్ ఆందోళన వ్యక్తం చేసింది.

యువకుడిపై డిప్యూటీ స్పీకర్ రేప్

బ్రిటిష్ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ నిగెల్ ఇవాన్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఓ యువకుడిపై అత్యాచారం చేసి, ఈ ప్రయత్నంలో మరో యువకుడిపై దాడి కూడా చేశారు. 2009 జూలైలో, 2013 మార్చిలో రెండుసార్లు ఈ అత్యాచారాలు జరిగాయట. ఆ యువకులు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అరెస్టు చేసి.. బెయిల్‌పై విడుదల చేశారు. తనను తాను స్వలింగ సంపర్కినని ప్రకటించుకొన్న ఇవాన్స్.. అత్యాచార ఆరోపణలు మాత్రం ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+