చిరు పాత్ర: కర్నాటకపై సిఆర్, రాహుల్ వల్లే: విహెచ్

రాష్ట్ర మంత్రుల మధ్య అభిప్రాయభేదాలు లేవని, మంత్రులు సమన్వయంతోనే పనిచేస్తున్నారని మరో రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అన్ని పథకాలు సక్రమంగా అమలవుతున్నాయని చెప్పారు. దేశంలో కాంగ్రెసు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, కర్నాటక ఎన్నికల ఫలితాలు దానికి నిదర్శనమని పొన్నాల అన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలపై సంతృప్తితో ఉన్నామని, దేశమంతా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని ఆయన అన్నారు.
కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించడానికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే కారణమని సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. ఇది దేశవ్యాప్తంగా ముందు ముందు కొనసాగుతుందని చెప్పారు.
కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించినట్లే 2014లో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో మైనింగ్ మాఫియాకు, మతతత్వ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. సోనియాగాంధీ నాయకత్వంలోనే రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని దానం తెలిపారు.
కర్నాటకలో ఫలితాలు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని తెలుగుదేశం పార్టీ నేత కళా వెంకట్రావు అన్నారు. అవినీతివల్లే భారతీయ జనతాపార్టీ ఓడిపోయిందని బుధవారం ఆయన మీడియాతో అన్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లనే కాంగ్రెసును గెలిపించారన్నారు. ఇక రాష్ట్రంలో కూడా అవినీతే ప్రధాన అజెండా అని కళా వెంకట్రావు అన్నారు. రాష్ట్రంలో టిడిపిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications