వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్ 'రియల్': కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన టిఆర్ఎస్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి తమకు పోటీగా తెలంగాణవాదం బలంగా వినిపిస్తున్న భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకునే పనిలో పడిందట. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన కూడా గురి పెట్టిందట.

కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేట నియోజకవర్గం నుంచి దీటైన అభ్యర్థిని రంగంలోకి దించాలని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయట. తెలంగాణకు అనుకూలమని బిజెపి పదే పదే చెబుతున్న క్రమంలో కిషన్‌ రెడ్డిపై పోటీకి గట్టి అభ్యర్థి కోసం అధినాయకత్వం వేట సాగిస్తున్నారట.

ప్రస్తుతం ఆ పార్టీ అంబర్‌పేట నియోజకవర్గం ఇన్‌చార్జీగా ఉన్న చిట్టెడి నర్సింహా రెడ్డిపై ఎలాంటి ప్రతికూలతలు లేవు. కాకపోతే కిషన్ రెడ్డిని ఢీకొనటం నర్సింహా రెడ్డికి సాధ్యం కాదని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కెసిఆర్ బంధువు ఒకరు తెర పైకి తీసుకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఆర్థిక బలం దృష్ట్యా ఆయనకు టికెట్ ఇవ్వటానికి తెరాస అధిష్ఠానం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులోభాగంగా చిట్టెడిని బుజ్జగించే యత్నాలను మొదలు పెట్టిందట. అదే జరిగితే పార్టీ నియోజకవర్గ ఇంచార్జీల్లో మరొకరికి మొండిచేయి చూపినట్లే అంటున్నారు.

English summary
It is said that Telangana Rastra Samithi is ready to face BJP in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X