వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెక్కింపు: పూజాగాంధీ, యడ్డీ ఆధిక్యం, బిజెపికి షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karnataka polls: Counting begins
బెంగళూరు: కర్నాటకలో ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభమైంది. 223 నియోజకవర్గాలలో ఈ నెల 5వ తేదిన ఎన్నికలు జరిగాయి. 2940 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో ఫలితం తేలనుంది. కర్నాటక వ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఆధిక్యంలో కాంగ్రెస్

కాంగ్రెసు స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు వెళ్తోంది. కాంగ్రెసు 12 స్థానాల్లో, బిజెపి 5 స్థానాల్లో, జెడిఎస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. శివకాపురి నియోజకవర్గంలో కెజెపి అధినేత యడ్యూరప్ప ఆధిక్యంలో ఉండగా, బళ్లారి రూరల్‌లో బిఎస్సార్ అభ్యర్థి శ్రీరాములు ఆధిక్యంలో ఉన్నారు. వరుణ నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థి సిద్దిరామయ్య అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

కాగా, ప్రీపోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెసు పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. బిజెపికి యాభై శాతం సీట్లు తగ్గనున్నాయని సర్వేలు తెలిపాయి. ఇవి కర్ణాటక 14వ శాసనసభ ఎన్నికలు. కౌంటింగ్ ప్రారంభమైన 3 గంటలలోపు అంటే 11 గంటలలోపు తొలి ఫలితం వెలువడనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

కాంగ్రెసు అధికారంలోకి వస్తుదని సర్వేలు చెప్పడంతో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. దీంతో, కర్ణాటక తదుపరి సిఎం ఎవరనే అంశంపైనా జోరుగా చర్చలు సాగుతున్నాయి. మరోవైపు, అన్ని పార్టీలకూ ఈ ఎన్నికలు దిశానిర్దేశం చేయనున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు పార్లమెంటు ఎన్నికలకు దిక్సూచిగా కాంగ్రెస్ భావిస్తోంది.

ఇక్కడ మంచి ఫలితాలు వస్తే ముందస్తుకు వెళ్లాలనే యోచనలో ఉందన్న కథనాలు ఇప్పటికే వస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో విజయం సాధిస్తే మొత్తం దక్షిణాదిలో మంచి మార్పు వస్తుందని కూడా ఆశిస్తోంది. ఇక, బిజెపి గెలిస్తే దక్షిణాదిలో పట్టును నిలబెట్టుకున్నట్లు అవుతుంది. కాంగ్రెస్ వ్యతిరేక గాలి స్పష్టమవుతుంది. జెడిఎస్ ఏమాత్రం వెనకబడినా మరో ఐదేళ్లపాటు ఉనికి కోల్పోనుంది.

ఇక రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత యడ్యూరప్ప ఆధ్వర్యంలోని కెజెపి తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొంది. ఇక్కడ ఏమాత్రం వెనకబడ్డా మరో పార్టీలో విలీనం కావడం మినహా ప్రత్యామ్నాయమే లేకుండాపోతుంది. అన్ని పార్టీలకూ ఈ ఎన్నికలు కీలకం కావడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బెట్టింగ్‌లూ తీవ్రమయ్యాయి.

English summary
The results of the crucial Karnataka assembly elections will be announced on Wednesday. The ruling BJP will face a stiff challenge to retain its first bastion in southern India, thanks to charges of corruption and misgovernance. But will the Congress emerge a stronger alternative or will BS Yeddyurappa's KJP will play a major role in disrupting the ambition of both the national parties?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X