'మా ఇంటి బంగారం' సెన్సార్ రివ్యూ: సమంత ఉతికి ఆరేసింది..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఇప్పుడు హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించారు. 2010లో ఏమాయె చేశావే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు సమంత. ఆ మూవీ పెద్ద హిట్ అయింది. తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఆమె ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారారు. అలా తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు సమంత. ఆ తర్వాత 2017 లో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ వివాహం.. మళ్లీ 2021 లోనే చైతూతో వ్యక్తిగత కారణాలతో విడాకులు.. ఇలా సామ్ కెరీర్ లో వెంటవెంటనే జరిగిపోయాయి.
అయితే చాలా ఏళ్ల తర్వాత ఇటీవల బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు సమంత. సమంత, రాజ్ నిడిమోరుల పరిచయం 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ద్వారా స్టార్ట్ అయింది. ప్రస్తుతం సమంత పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఓ బేబీ, ఖుషి లాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని తాజాగా 'మా ఇంటి బంగారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సమంత. ఈ చిత్రం జూన్ 19న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
ట్రైలర్ ను బట్టి చూస్తే మా ఇంటి బంగారం మూవీ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సమంత ఓ సాధారణ మధ్యతరగతి గృహిణిగా కనిపిస్తూనే.. తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి శత్రువులతో పోరాడే ఒక పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో అదరగొట్టినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టం అవుతోంది. ఈ చిత్రం కోసం సమంత డూప్ లేకుండా సొంతంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ చేసినట్లు సమాచారం. ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ రెండు గంటల 20 నిమిషాలు ఉంది.
ఇక సెన్సార్ టాక్ ప్రకారం మూవీకి పాజిటివ్ రిపోర్ట్ వినిపిస్తోంది. ఈ మూవీ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందినట్లు సమాచారం. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో యాక్షన్‌తో అదరగొట్టిన సమంత ఇప్పుడు.. మా ఇంటి బంగారంలో తనదైన యాక్షన్ తో రెచ్చిపోయారు. చీరకట్టులో ఆమె చేసిన యాక్షన్ మైండ్ బ్లాక్ అని తెలుస్తోంది. . ఈ మూవీలో యాక్షన్ సీన్లు హైలైట్ గా నిలుస్తాయని, కామెడీ కూడా బాగుంటుందని అంటున్నారు.

అలాగే మూవీలోని థ్రిల్లింగ్ అంశాలు సర్‌ప్రైజ్ చేస్తాయని సమాచారం. సంగీతం, బీజీఎం సినిమాకి మరో ప్లస్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. మరో విశేషం ఏంటంటే..సమంత భర్త రాజ్ నిడిమోరు దీనికి కథ, స్క్రీన్ ప్లే అందించడం.. ఆయన కూడా నిర్మాత అయ్యారు. జూన్ 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications