పల్నాడు, సింహాద్రి ఎక్స్ ప్రెస్ ల్లో కీలక మార్పు..! ఇకపై ఇలా..

గుంటూరు జిల్లా నుంచి బయలుదేరే రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు పల్నాడు (Palnadu Express), సింహాద్రి (Simhadri Express)లో రైల్వే కీలక మార్పులు చేస్తోంది. గుంటూరు-వికారాబాద్ మధ్య పల్నాడు ఎక్స్ ప్రెస్, గుంటూరు-విశాఖ మధ్య సింహాద్రి ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రెండు రైళ్లలో ప్రయాణికులకు మరింత సౌలభ్యం అందించేందుకు వీలుగా వీటి కోచ్ లలో మార్పులు చేయాలని రైల్వే నిర్ణయించింది. ఈ వివరాలను ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఇకపై ఈ రెండు రైళ్లలో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారబోతోంది.

దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోకి వచ్చే గుంటూరు డివిజన్ లోకి వచ్చే పల్నాడు ఎక్స్ ప్రెస్, సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రస్తుతం పాత ఐసీఎఫ్ బోగీలు ఉన్నాయి. వీటిని ఇప్పుడు అత్యాధునిక ఎల్ హెచ్ బీ కోచ్ (LHB Coaches) లుగా మారుస్తున్నారు. పల్నాడు ఎక్స్ ప్రెస్ కు ఈ నెల 22 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. అలాగే సింహాద్రి ఎక్స్ ప్రెస్ కు ఈ మార్పు గుంటూరు వైపు నుంచి ఈనెల 23న, విశాఖ వైపు నుంచి ఈ నెల 24న అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు.

Palnadu Express and Simhadri Express to Get Upgraded LHB Coaches Replacing Older ICF Rakes

తాజా మార్పుల తర్వాత పల్నాడు ఎక్స్ ప్రెస్ లో 22 ఐసీఎఫ్ బోగీల స్ధానంలో 20 ఎల్ హెచ్ బీ కోచ్ లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే సింహాద్రి ఎక్స్ ప్రెస్ లోనూ 22 ఐసీఎఫ్ బోగీల స్ధానంలో 20 ఎల్ హెచ్ బీ కోచ్ లు మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. సాంప్రదాయ ICF కోచ్‌లతో పోలిస్తే, LHB (లింకే హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు అనేవి యాంటీ-టెలిస్కోపిక్ భద్రతా రూపకల్పన, అధిక వేగ సామర్థ్యం (గంటకు 160 కి.మీ., దీనిని గంటకు 200 కి.మీ. వరకు పెంచుకోవచ్చు. ఇవి అధునాతన భారతీయ రైల్వే కోచ్‌లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+