ఉపరాష్ట్రపతిని కలిసిన గుంటూరు జిల్లా విద్యార్థులు (వీడియో)
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. ఈ విద్యార్థులు ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి భవన్‌లో ఇవాళ కలుసుకున్నారు. పేద, అట్టడుగు వర్గాల నుండి దిల్లీకి విద్యా పర్యటనకు వచ్చిన ఈ విద్యార్థులను ఆయన ప్రశంసించారు. ఇలాంటి పర్యటనలు తరగతి గదులకే పరిమితం కాకుండా.. విద్యార్థులకు విశాలమైన దృక్పథాలను ఇస్తాయని ఉపరాష్ట్రపతి అన్నారు.

తమ ఆర్థిక సమస్యలకు నిరుత్సాహపడకుండా విద్య ద్వారానే జీవితంలో విజయం సాధించవచ్చని ఆయన వారికి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని.. వాటి పనితీరును ప్రోత్సహించాలని సీపీ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, బలోపేతంపై దృష్టి సారించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Vice President Shri C. P. Radhakrishnan interacted with school students from Guntur district, Andhra Pradesh at Uprashtrapati Bhavan today.
— Vice-President of India (@VPIndia) May 21, 2026
Here are some glimpses. pic.twitter.com/Tjzy7WyT4e
విద్యా పర్యటనలో ఉన్న 41 మంది ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో 27 మంది బాలికలు ఉండటంపై ఉపరాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశంలో 'నారీ శక్తి' పెరుగుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. కష్టపడి పని చేయాలని, విజయంలో వినయంగా ఉండాలని, సమాజ శ్రేయస్సు కోసం జ్ఞానాన్ని ఉపయోగించాలని ఆయన విద్యార్థులకు మూడు ముఖ్య సూత్రాలను బోధించారు.












Click it and Unblock the Notifications