హైదరాబాద్ నుంచి ఈ రూట్ లో అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు.. హాల్ట్ స్టేషన్లు

ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.

తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో నూతన మార్గంలో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఇవి.. పూర్తిగా అన్ రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్స్. హైదరాబాద్ - వాడి మార్గంలో ఈ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రయాణ సౌకర్యాలను మరింతగా పెంచడంలో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ నెల 29 నుంచి ఇవి పట్టాలెక్కనున్నాయి.

SC Railway runs Hyderabad to Wadi Unreserved Special Trains for Smooth Travel clear extra passengers rush

ఈ నెల 29న సోమవారం ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07175 అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైలు అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు వాడికి చేరకుంటుంది.

వాడి నుంచి అదే రోజు సాయంత్రం 4 గంటలకు బయలుదేరే నంబర్ 07176 ప్రత్యేక రైలు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.

జులై 1వ తేదీన బుధవారం తెల్లవారు జామున 5 గంటలకు హైదరాబాద నుంచి బయలుదేరే నంబర్ 07175 ప్రత్యేక రైలు అదే రోజు ఉదయం 10 గంటలకు వాడికి చేరుకుంటుంది.

అదే రోజు ఉదయం 11:40 నిమిషాలకు వాడి నుంచి బయలుదేరే నంబర్ 97176 ప్రత్యేక రైలు సాయంత్రం 4: 35 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.

బేగంపేట, సనత్‌నగర్, హఫీజ్‌పేట, లింగంపల్లి, నాగులపల్లి, శంకరపల్లి, గుల్లగూడ, వికారాబాద్, గొడంగూరు, ధరూర్, రుక్మాపూర్, తాండూరు, మంతట్టి, నవాంద్గి, కుర్కుంట, సేడం, మల్ఖేడ్ రోడ్, చిత్తాపూర్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. మొత్తం 22 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌ల ఉంటాయి ఇందులో. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ కింద ప్రయాణీకులు నేరుగా టికెట్లు పొంది ఈ రైళ్లలో ప్రయాణించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+