కర్నాటక: పూజాగాంధీ వెనుకంజ, ఒకేఒక్కడు అంబరీష్

బళ్లారి జిల్లాలో ప్రభావం చూపుతుందనుకున్న బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఏమాత్రం చూపలేదు. కేవలం రెండు నియోజకవర్గాలలో మాత్రమే ముందంజలో ఉంది. యడ్యూరప్ప కూడా తన సొంత జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో కేవలం రెండింటిలో మాత్రమే ముందంజలో ఉన్నారు. మొత్తంగా పది నియోజకవర్గాల్లో యడ్యూరప్ప పార్టీ ముందంజలో ఉంది. నటి పూజా గాంధీ వెనుకంజలో ఉన్నారు. ఆమె రాయచూర్ రూరల్ నుండి పోటీ చేస్తున్నారు.
దక్షిణ కర్నాటకలో కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో దూసుకు పోతుంది. హొన్నాళిలో కెజెపి ఆధిక్యంలో ఉంది. బెంగళూరులో మాత్రం కాంగ్రెసు, బిజెపిల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఇరు పార్టీలు పది స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు ఐదు నియోజకవర్గాల్లో ఉన్నారు. హసన్, ధార్వాడ్, చిత్రదుర్గ, చెరుగుప్పలో కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో ఉంది. బంగారప్ప కుటుంబ సభ్యులు వెనుకంజలో ఉన్నారు. బళ్లారి పట్టణంలో కాంగ్రెసు ముందంజలో ఉంది. మాండ్యలో ఏడు సీట్లు ఉంటే ఆరింటిలో జెడి(ఎస్) ముందంజలో ఉండగా.. అంబరీష్ మాత్రం ఒక్కరే కాంగ్రెసు పార్టీ తరఫున ముందంజలో ఉన్నారు.
కాగా, బిజెపి 80 నుండి 90 స్థానాల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ అన్నారు. బిజెపి ఎక్కువ సీట్లు సాధిస్తే జెడి(ఎస్)తో పొత్తుకు సిద్ధమని చెప్పారు. కాంగ్రెసు దూకుడుతో ఏఐసిసి కార్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తున్నాయి.












Click it and Unblock the Notifications