వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను జైల్లో ఉంచే కుట్ర: ఆంగ్ల టివి ఛానల్‌తో భారతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 YS Bharathi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, ఈ విషయంలో రాష్ట్రంలో చిన్న పిల్లాడికి కూడా తెలుసునని జగన్ సతీమణి వైయస్ భారతి గురువారం అన్నారు. జగన్‌ను జైల్లో ఉంచడమే సిబిఐ లక్ష్యమని, అందుకే ఈ కేసులో దర్యాప్తు చేయడమే లేదని ఆరోపించారు. జగన్‌కు బెయిల్ నిరాకరణపై గురువారం ఆమె ఆంగ్ల న్యూస్ ఛానెల్ ఎన్డీటివితో మాట్లాడారు.

ఈ కేసును సిబిఐ 21 నెలలుగా దర్యాప్తు చేస్తోందని అక్టోబర్‌లో బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పుడు.. మరో మూడు నెలల గడువు కావాలని సిబిఐ అడిగిందని, ఇప్పటికి 8 నెలలైందని, ఇప్పుడు మరో 4 నెలల సమయం కావాలని అంటున్నారని, గురువారం సుప్రీం కోర్టు అలా తీర్పు ఇచ్చిందో లేదో వారి న్యాయవాది బయటకొచ్చి మాట్లాడుతూ.. 4 నెలల తర్వాత తాము ఈ గడువును పెంచాలని అడిగే అవకాశముందని చెప్పారని భారతి అన్నారు.

దర్యాప్తు పూర్తి చేయాలన్న ఆలోచనే వారికి లేదని దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. అసలు దర్యాఫ్తే జరగడం లేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకే జగన్ పైన కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. జగన్‌కు ఇప్పట్లో బెయిల్ రాదని, ఏదో ఒక రోజు ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో కలపక తప్పదని ఇటీవల కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా అన్నారని చెప్పారు.

జగన్ కాంగ్రెస్‌లోనే ఉంటే ఆయన మీద కేసులే ఉండేవి కావని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కూడా అప్పట్లో చెప్పారని గుర్తు చేశారు. జగన్ మీద చేస్తున్నవి తప్పుడు ఆరోపణలని ప్రజలకు తెలుసునని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. గత ఉప ఎన్నికల్లోనూ వారు కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతూ తీర్పు తీర్పు ఇచ్చారన్నారు. సిబిఐ కాంగ్రెసు ద్వారా ప్రభావితమవుతుందని డిఎంకె, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, యడ్యూరప్ప కేసులను చూసినా అర్థమవుతోందన్నారు.

యూపిఏతో అలయెన్స్ పైన మాట్లాడుతూ... తాము కేంద్రంతో చర్చలు జరిపితే జగన్ జైల్లో ఎందుకుంటారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాము ముందుకు వెళ్తామన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వేచ్ఛగా బయట తిరుగుతుండగా.. జివోలతో సంబంధం లేని జగన్ మాత్రం జైలులో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

English summary

 YS Bharathi, wife of YSR Congress Party chief YS Jaganmohan Reddy, on Thursday accused the Central Bureau of Investigation of hatching a conspiracy to deny bail to her husband with the intention of delaying the investigation and confining him in jail for an indefinite period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X