చరణ్ చెప్పాడు, చెప్పేది లేదు: టెక్కీలతో రచ్చపై చిరు

హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో రామ్ చరణ్ తేజ కారులో వెళ్తుండగా.. అడ్డు వచ్చిన ఇద్దరు టెక్కీలను ఆయన అంగరక్షకులు దాడి చేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తన కారును ఢీకొట్టాడనే కారణంతో రామ్ చరణ్ ఆ ఇద్దరిపై చేయి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అంగరక్షకులు చేయి చేసుకున్నారని, అప్పుడు రామ్ చరణ్ వారిని అడ్డుకోలేదని చెబుతున్నారు.
జివికె మాల్ సమీపంలోని తాజ్ డెక్కన్ హోటల్ వద్ద ఈ ఘటన ఆదివారంనాడు జరిగింది. రామ్ చరణ్ తేజకు బాధితులు సైడ్ ఇవ్వక పోవడం వల్లనే వారి కారును ఓవర్ టేక్ చేసిన చెర్రీ వారితో వాగ్వాదానికి దిగాడని, ఆ తర్వాత తన వ్యక్తిగత సిబ్బందిని పిలిపించి దాడికి పాల్పడ్డారని కూడా చెబుతున్నారు.
అయితే, వివాదం అంతటితో సద్దుమణగలేదు. తన పట్ల టెక్కీలే దురుసుగా ప్రవర్తించారని, అందుకు వారు క్షమాపణ చెప్పారని రామ్ చరణ్ తేజ చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. తాము క్షమాపణ చెప్పలేదని టెక్కీ ఫణీష్ స్పష్టం చేశారు. దాంతో తిరిగి రామ్ చరణ్ తేజ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఫొటోలను మార్ఫ్ చేశారని మీడియాను తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications