హైదరాబాదులో విషాదం: ఇద్దరిని మింగిన మ్యాన్‌హోల్

శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న అతడు సహాయం కోసం కేకలు వేశాడు. అటుగా వెళ్తున్న ఒక బీహార్ యువకుడు అతన్ని కాపాడడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.
స్థానికులు సమాచారం మేరకు మున్సిపల్ అధికారులు, రెస్క్యూ టీం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన మున్సిపల్ కార్మికుడిని మహబూబ్‌నగర్‌కు చెందిన సత్యంగా అధికారులు గుర్తించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురంలో కొందరు దుండగులు నగల కోసం ఓ మహిళను దారణంగా హత్య చేశారు. దుండగులు బంగారు, వెండ ఆభరణాలు అపహరించుకుని పోయారు.
అనంతపురం జిల్లా హిందూపురం రైతు సదస్సులో విషాదం చోటు చేసుకుంది. రైతు సదస్సులో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు లక్ష్మినారాయమ శనివారం గుండెపోటుతో మరణించాడు. లక్ష్మినారాయణ ఆంధ్రప్రభ దినపత్రికలో పనిచేస్తున్నాడు.












Click it and Unblock the Notifications