తప్పు చేయలేదు, రాజకీయం వద్దనే: అశ్వినీ కుమార్

Ashwani Kumar
న్యూఢిల్లీ: మనస్సాక్షిగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని న్యాయశాఖ మాజీ మంత్రి అశ్వినీకుమార్ తెలిపారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీం కోర్టు కూడా తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని సమర్థించుకున్నారు. రాజకీయ వివాదాలు వద్దనుకునే పదవికి రాజీనామా చేసినట్లు వివరణ ఇచ్చారు. తాను పార్టీకి విధేయుడైన కార్యకర్తనని, ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు.

మీడియానే అనవసరపు రాద్దాంతం చేస్తోందని ఆరోపించారు. మీడియా సమావేశంలో మూడు నిమిషాల్లో తాను చెప్పాల్సింది చెప్పిన అశ్వినీకుమార్ మీడియాకు ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోయారు. రాజీనామా చేసినంత మాత్రాన తప్పు చేసినట్లు కాదని ఆయన అన్నారు. నిజాయితీ నిరూపించుకుంటానని ఆయన చెప్పారు.

మిమ్మల్ని బలిపశువును చేశారని భావిస్తున్నారా అని అడిగితే ఆయన సమాధానం ఇవ్వలేదు. ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. తానేమిటో దేశ ప్రజలకు, తన మిత్రులకు, చాలా మంది మీడియా ప్రతినిధులకు, తన సహచరులకు తెలుసునని, వారేం తీర్పు చెబుతారో చూద్దామని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ నిర్ణయాలు అవసరంగా మారుతాయని ఆయన చెప్పారు.

యుపిఎ - కుంభకోణాల మయంగా మారిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. అవినీతిని నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎవరిని రక్షించడానికి అశ్వినీ కుమార్ రాజనామా చేశారని ఆయన అడిగారు. పాలనలో వైఫల్యాలు వెలుగు చూస్తున్నా ప్రధాని నోరు మెదపడం లేదని ఆయన అన్నారు. యుపిఎ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయందని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు పవన్ కుమార్ బన్సల్ చేతిలో ఉన్న రైల్వే శాఖను సిపి జోషీకి, న్యాయశాఖను కపిల్ సిబాల్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+