కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న గజల్ శ్రీనివాస్

కాంగ్రెసు పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. తన తల్లి, తాత స్పూర్తిలతోనే తాను కాంగ్రెసు పార్టీలో చేరానని అన్నారు. చేరితే కాంగ్రెసులోనే చేరాలని వారు చెప్పేవారన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.
కాగా, గజల్ శ్రీనివాస్ తెలుగు గజల్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఇతని స్వగ్రామం. ఇతని అసలు పేరు కేశిరాజు శ్రీనివాస్. 1986 నుండి తెలుగులో గజల్స్ గానం చేస్తూ, దేశంలోనే కాకుండా ప్రపంచంలోనేగానం చేస్తున్నారు.
హార్మోనియం, తబలా, సరోద్‌ల వంటి ప్రక్క వాయిద్యాల సహకారం లేకుండా కేవలం కంజీరాను సహ వాయిద్యంగా ఉపయోగిస్తూ, దానిని తానే వాయిస్తూ శృతి లయాత్మకంగా గానం చేయడం విశేషం. ఇతను ఆంధ్రా యూనివర్సిటీ నుండి బిఏ పూర్తి చేశారు. ఇతని తల్లిదండ్రులు రత్నావళి, నరసింహ రావు. భార్య సురేఖ, ఒక కూతురు సంస్కృతి. ఈ పాప మూడో ఏటి నుండే తండ్రితో పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications