ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఎలుకలమందిచ్చి చంపేసింది!

 Woman kills husband with the help of mother
హైదరాబాద్/కరీంనగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ఓ భార్య దారుణంగా హత్య చేసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఆమెకు తల్లి, సోదరుడు సాయపడ్డారు. వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన శారద అనే మహిళ భర్తతో వేరుపడి, తన కూతురు దేవి, కొడుకు నవీన్‌లతో కలిసి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి బోడుప్పల్ ప్రాంతానికి చెందిన రజనీకాంత్ (28), దేవి రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

కొద్దికాలం బాగానే ఉన్న వారి మధ్య తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి రజనీకాంత్ భార్యను కొట్టే దాకా వెళ్లింది. ఈ నేపథ్యంలో శారద ఏడాది కిందట కరీంనగర్‌కు మకాం మార్చారు. ఐదు నెలల క్రితం దేవి పురిటి కోసం ఆమె వద్దకు వచ్చింది. దేవికి పాప పుట్టింది. తల్లీబిడ్డలను తీసుకెళ్లేందుకు రజనీకాంత్ గురువారం సాయంత్రం ఇక్కడికి వచ్చాడు. భార్యను రమ్మని అతడు అడగడం, రానని దేవి చెప్పడంతో.. శుక్రవారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగి, దేవిని రజనీకాంత్ కొట్టాడు.

దీంతో అతణ్ని చంపేయాలని దేవి, శారద, నవీన్ నిర్ణయించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మద్యం సేవించి నిద్రపోయిన రజనీకాంత్.. మధ్యలో లేచి మంచినీళ్లు కావాలని అడగ్గా, వారు నీళ్లలో ఎలుకల మందు కలిపి ఇచ్చారు. ఆ నీరు తాగిన రజనీకాంత్ స్పృహ కోల్పోయాడు. అప్పుడు తల్లీకూతుళ్లు అతడి గొంతు నులిమి చంపారు. అంతకుముందు గొడవ సందర్భంగా వారికి సర్ది చెప్పిన ఇంటి యజమానికి అనుమానం వచ్చి రజనీకాంత్ గురించి అడగ్గా ఇంకా నిద్ర లేవలేదని అబద్ధమాడారు.

శనివారం ఉదయం రజనీకాంత్ శవాన్ని ఇంటి ముందు ఉన్న చెట్లల్లో పడేసి, పైన చెత్త వేసి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. పోలీసు జాగిలం రజనీకాంత్ హత్యకు గురైన గది వద్దకు వెళ్లటంతో అనుమానాలు బలపడ్డాయి. వెంటనే రజనీకాంత్ భార్యను, తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఆంటోనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+