రాహుల్‌గాంధీకి ఉచితంగా దినపత్రిక: బాలుడి దత్తత

 Congress offers aid to boy who gave free newspaper to Rahul Gandhi
భోపాల్: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఉచితంగా దిన పత్రికను ఇచ్చిన ఓ పదేళ్ల బాలుడిని మధ్య ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ దత్తత తీసుకుంది. ఇరవై రోజుల క్రితం రాహుల్ గాంధీ కారులో రాజ్ భోజ్ విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో కౌశిల్ శక్య అనే బాలుడు దినపత్రికను కొనాల్సిందిగా కోరాడు.

బాలుడు అడగడంతో పత్రికను తీసుకున్న రాహుల్ గాంధీ.. అతనికి వెయ్యి రూపాయల నోటును ఇచ్చాడు. అంత మొత్తానికి తన వద్ద చిల్లర లేదని బాలుడు ఆ వెయ్యి రూపాయల నోటును తిరిగి రాహుల్ గాంధీకి ఇచ్చారు. చిల్లర లేదని రాహుల్ చెప్పడంతో ఆ బాలుడు పత్రికను ఉచితంగానే ఇచ్చాడు.

అనంతరం కొద్దిసేపు బాలుడితో రాహుల్ గాంధీ మాట్లాడారు. తనకు వైద్య వృత్తి అంటే ఇష్టమని, వైద్యుడిని కావాలని ఆశ ఉందని చెప్పాడు. ఆ తర్వాత రాహుల్ గాంధీ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు కాంతిలాల్ భురీయా శనివారం పార్టీ కార్యాలయంలో కౌశల్, అతని తండ్రిని కలిశారు.

బాలుడిని సత్కరించారు. అనంతరం కాంగ్రెసు పార్టీ బాలుడిని దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. కౌశిల్‌కు నెలకు రూ.1000 అందించనున్నట్లు చెప్పారు. పార్టీకి చెందిన మరో నేత సాజిద్ అలీ... అతని తండ్రి దులిచాంద్ శక్యకు తన కళాశాలలో ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+