జగన్‌తో సై అంటూనే.. బాబును కాపీకొడుతున్న కిరణ్!

YS Jagan - Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి షాక్ ఇస్తున్నారు! దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు మొదటి నుండి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లేందుకు కిరణ్ ప్రభుత్వం పాత పథకాలు కొనసాగిస్తామని చెబుతూనే.. మరిన్ని కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది.

వైయస్ పథకాలు కొనసాగించడం లేదన్న జగన్ పార్టీకి ముఖ్యమంత్రి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. తాము ఏ పథకాన్ని ఆపలేదని, ఆరోపిస్తున్న వారు నిరూపించాలని సవాల్ చేస్తున్నారు. ఓ వైపు జగన్‌కు సవాల్ చేస్తూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఇచ్చిన హామీలను కాపీ కొడుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

పాదయాత్రలో బాబు చాలా హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే... అంటూ పలు పథకాలు ప్రవేశ పెడతామని చెప్పుకొచ్చారు. అలా బాబు చెబుతున్నారో లేదో.. ఇలా కిరణ్ వాటిని ప్రవేశపెట్టి టిడిపి ఆశలకు గండికొడుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు పలు ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి.

టిడిపి అధికారంలోకి వస్తే ఆడపిల్లకు రూ.రెండు లక్షలు ఇస్తామని చంద్రబాబు చెప్పగా.. కిరణ్ బంగారు తల్లి పథకాన్ని ప్రవేశ పెట్టారు. వస్తవ్యాపారులకు వ్యాట్ రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి దానిని అమలు చేశారు. బెల్టు షాపులు మూయిస్తానని టిడిపి చెబితే.. ఆ దిశగా కిరణ్ చర్యలు ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీలకు బాబు హామీ ఇస్తే.. కిరణ్ ఇందిరమ్మ కలలతో దూసుకెళ్తున్నారు. బిసిలకు సబ్ ప్లాన్ అని టిడిపి అంటే ఆ దిశగా కిరణ్ రూపకల్పన చేస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+