కెసిఆర్ హీరోగా సినిమా తీస్తా: టిజి వెంకటేష్ సెటైర్లు

కెసిఆర్ సిగరెట్ మానేసి వ్యవసాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారని, ఇది మంచి పరిణామమని ఆయన అన్నారు. తెలంగాణలో తెలంగాణవాదం లేకుండా పోయిందని, దీనికి కారణం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డేనని ఆయన అన్నారు. కెసిఆర్‌తో సినిమా తీసి సందేశాత్మక చిత్రంగా సమైక్యవాదులకు అంకితం చేస్తానని ఆయన అన్నారు.
ఆ సినిమాకు తెరాస శాసనసభ్యుడు, కెసిఆర్ తనయుడు ఫైటర్‌గా, ఎమ్మెల్యే హరీష్ రావు మాటల రచయితగా ఉంటారని ఆయన అన్నారు. విజయశాంతి కూడా సినిమాలో ఉంటారని ఆయన చెప్పారు. కర్నూలును సోలార్ సిటీగా మార్చేందుకు ప్రయత్నం చేస్తామని వెంకటేష్ చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట నడుస్తున్న కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులపై ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి మండిపడ్డారు. కొంత మంది శాసనసభ్యులు రాజీనామా లేఖలు ఇచ్చి ఆ తర్వాత ఆమోదించవద్దని స్పీకర్‌ను కోరారని ఆయన చెప్పారు. జగన్ స్ఫూర్తిగా కాకుండా కాంగ్రెసుకు వెన్నుపోటు పొడవడం వారి నైజమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
అమ్మహస్తంపై బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్న ట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రిపై ఎర్రచందనం కేసు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎర్రచందనం కేసు వేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు పి. శంకర రావు చెప్పారు. కళంకిత మంత్రులకు ఉద్వాసన చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో మాదిరిగానే రాష్ట్రంలోనూ అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని ఆన అన్నారు. రాష్ట్రంలో మంత్రుల అవినీతితో కాంగ్రెసు శ్రేణులు నీరుగారిపోయాయని ఆయన అన్నారు. కర్ణాటకలో బిజెపి పరిస్థితిని రాష్ట్రంలో కాంగ్రెసు తెచ్చుకోవద్దని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications