డాక్టర్ నిర్వాకం: కళ్లు చూసే మిషతో ముద్దు పెట్టాడు

కూకట్‌పల్లికి చెందిన ఓ వివాహిత చాలా కాలంగా జూయింట్ పెయిన్స్, తలనొప్పులకు అతన్ని చాలా కాలంగా సంప్రదిస్తూ ఉంది. ఆ 36 ఏళ్ల వివాహితను ప్రైవేట్ ఆస్పత్రిలోని తన కార్యాలయానికి రావాలని సూచించాడు. అలా వెళ్లిన ఆ మహిళ పట్ల పాపారావు అసభ్యంగా ప్రవర్తించాడు.
తన కళ్లను పరీక్షించే నెపంతో వైద్యుడు తనను అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్నాడని, ఈ సంఘటన జరిగినప్పుడు డాక్టర్‌తో తాను ఒక్కర్తే ఉన్నానని, తన అత్త బయట నిరీక్షిస్తోందని బాధితురాలు చెప్పింది. తనను ముద్దు పెట్టుకున్న వైద్యుడిని మహిళ పక్కకు తోసేసి గది నుంచి బయటకు పరుగెత్తింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయలేదు. సెలవు కావడంతో చుట్టుపక్కల సిబ్బంది లేరని, వైద్యుడిని సస్పెండ్ చేశామని ప్రైవేట్ ఆస్పత్రి అధికార ప్రతినిధి చెప్పారు.












Click it and Unblock the Notifications