వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరీష్ గంతులు: టిజి వెంకటేష్, బాబుపై అంబటి ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu and TG Venkatesh
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు తనపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ స్పందించారు. హరీష్ రావు శానససభలో హనుమంతుడిలా కుప్పిగంతులు వేశారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. హరీష్ రావు కుప్పిగంతులే తెలంగాణకు ఆటంకంగా మారాయని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని తెరాస కామెడీ షోగా మార్చిందని ఆయన విమర్శించారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలతో మంచి సంబంధాలు లేని తెరాస తెలంగాణను సాధించడం సాధ్యం కాదని టిజి వెంకటేష్ అన్నారు. పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, వాటితో విడిపోవడం తెరాస పని అని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా అని ఆయన చంద్రబాబును సవాల్ చేశారు. అవినీతికి బ్రాండ్ చంద్రబాబు అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. నీరు - మీరు వంటి ప్రభుత్వ పథకాల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆయన అన్నారు. నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో చంద్రబాబు మంత్రివర్గ సహచరుడు అడ్డంగా దొరికిపోయాడని ఆయన అన్నారు. అవినీతిపై చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.

తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ఎన్నో కుంభకోణాలు, ఆరోపణలు వచ్చాయని, టిడిపి రాష్ట్ర కార్యాలయాన్ని ఎల్ అండ్ టీ సంస్థ కట్టించిందని ఆయన అన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ చదువులకు సత్యం రామలింగరాజు ఫీజులు కట్టారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై వామపక్షాలు పుస్తకాలు ప్రచురించింది వాస్తవం కాదా అని ఆయన అడిగారు. ప్రజలు చంద్రబాబు గతం మరిచిపోలేదని అంబటి రాంబాబు అన్నారు.

English summary
Minister TG Venkatesh said that Telangana Rastra samithi (TRS) has made telangana movement as a comedy show. The YSR Congress party leader Ambati Rambabu fired at the Telugudesam party president Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X