నేవీలో మరో సెక్స్ స్కామ్: భర్తపై భార్య ఫిర్యాదు

ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవలసిందిగా రక్షణ మంత్రి నౌకాదళ కమాండర్ల సమావేశంలో ఉన్నతాధికారులను కోరిన రోజే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. రక్షణ మంత్రి ఎంతో సహకరించారని, తన భర్తపై తాను, తన తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు ఆయన తనకు చెప్పారని మంగళవారం రక్షణ మంత్రితో సమావేశం అనంతరం ఆమె మీడియాతో అన్నారు.
కర్ణాటక తీరంలోని కార్వార్‌లోని నౌకాదళానికి చెందిన నౌకల మరమ్మతు యార్డులో లెఫ్టెనెంట్ కల్నల్‌గా పనిచేస్తున్న తన భర్త ఆయన సహచరులతో సెక్స్‌లో పాల్గొనాలని, మద్యం తాగాలని తనను బలవంతం పెడుతున్నాడని ఆమె చెప్పింది. ఈ ఉదంతం తర్వాత తాను పుట్టింటికి పారిపోయానని, అయినప్పటికీ తన భర్త తనను మానసికంగా చిత్రహింసలు పెడుతున్నాడని కూడా ఆమె చెప్పింది.
ఎంబిఏ చదివిన ఆమెకు ఆ అధికారితో గత ఫిబ్రవరిలో పెళ్లయింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఇంటర్నెట్‌లో తన న్యూడ్ ఫోటోలు ఉంచి, సమాజంలో తన ప్రతిష్ఠను దెబ్బతీస్తానని కూడా బెదిరిస్తున్నాడని ఆమె చెప్పింది. తన భర్తకు రష్యాలోని షిప్‌యార్డ్‌లో నిర్మాణం అవుతున్న విమాన వాహక నౌక అడ్మిరల్ గోర్ష్‌కోవ్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించారని, త్వరలోనే అతను అక్కడికి వెళ్లనున్నట్లు కూడా ఆమె చెప్పింది. తన భర్తపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని గత నెల 30న రక్షణ మంత్రికి పంపిన ఫిర్యాదులో ఆమె కోరింది.












Click it and Unblock the Notifications