కుట్ర: ధోనీ, భజ్జీలపై పేసర్ శ్రీశాంత్ తండ్రి నిందలు

స్పాట్ ఫిక్సింగ్‌లో రాజస్థాన్ రాయల్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలలను గురువారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శ్రీశాంత్‌కు తండ్రి అండగా నిలిచాడు. తన కుమారుడు అమాయకుడని, కుట్రకు బలయ్యాడని ఆయన అన్నారు.
తన కుమారుడు శ్రీశాంత్ క్రికెట్ కెరీర్‌ను అంతం చేయడానికి ధోనీ, హర్భజన్ కుట్ర చేశారని శాంతకుమారన్ హిందుస్థాన్ టైమ్స్ వార్తాపత్రికతో అన్నారు. పంజాబ్ పోలీసు డిప్యూటీ సూపరింటిండెంట్ హర్భజన్ కుట్రను అమలు చేసినట్లు ఆయన ఆరోపించాడు. భారత జట్టులోకి శ్రీశాంత్ రాలేడని ధోనీ ఇటీవల హెచ్చరించాడని ఆయన గుర్తు చేశాడు.
శ్రీశాంత్ అమాయకుడని, నిబద్ధత గల ఆటగాడని, అటువంటి పనులు శ్రీశాంత్ చేయబోడని శ్రీశాంత్ బావ, నేపథ్య గాయకుడు మధు బాలకృష్ణన్ అన్నారు.












Click it and Unblock the Notifications