షాక్: శ్రీశాంత్, చండిలలకు అమ్మాయిల సప్లై?
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతోనే దిగ్భ్రాంతికి గురైన నేపథ్యంలో మరో దిమ్మ తిరిగే విషయం బయటపడింది. సంచలనం కలిగించే విషయాలు బయటకు వస్తున్నాయి. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఐపియల్ రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలలకు బుక్కీలు అమ్మాయిలను సరఫరా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
టీవీ చానెళ్లు ప్రసారం చేస్తున్న కథనాల ప్రకారం - ఆటగాళ్లకు, బుక్కీలకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను బట్టి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడే ఆటగాళ్లకు బుక్కీలు అమ్మాయిలను సరఫరా చేసేవారని తెలుస్తోంది. ఇద్దరు బుక్కీలు మనన్, చంద్ శ్రీశాంత్, అజిత్ చండిలలకు కనీసం మూడు సందర్భాల్లో అమ్మాయిలను సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

గురువారం అరెస్టయినప్పుడు శ్రీశాంత్ తన హోటల్ గదిలో ఓ అమ్మాయితో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ సంభాషణలను బట్టి స్పాట్ ఫిక్సింగ్‌లో లేని మరో ఆటగాడు బుక్కీలు అందించిన ఎస్కార్ట్ సర్వీసును ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీశాంత్, చండిల, అంకిత్ చవాన్‌లను పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒక్క ఓవరులో బుక్కీలు ఆశించిన పరుగులను ఇవ్వడానికి ఆ ముగ్గురు 60 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications