వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంజయ్ దత్: ఏడ్చాడు, రాత్రి జైల్లో నిద్రపోలేదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sanjay Dutt
ముంబై: ముంబై బాంబు పేలుళ్ల కేసులో మరో 42 నెలల జైలు శిక్ష అనుభవించడానికి ఆర్థర్ రోడ్ జైలుకు చేరుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు గురువారం రాత్రి చాలా కష్టంగా గడిచిందట. ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఆయన రాత్రి నిద్ర పోలేదంటూ శుక్రవారం వార్తలు వచ్చాయి. హై సెక్యూరిటీ జైలులోని ట్రాన్సిట్ బరాక్‌లో సంజయ్ దత్‌ను ఉంచారు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అతన్ని జైలుకు చేర్చారు.

జైలుకు వచ్చిన తర్వాత సంజయ్ దత్ ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారం తీసుకున్నారట. ఆ తర్వాత నిద్రపోవడానికి పడుకున్నాడు. ఓ బాటిల్ వాటర్ అడిగి తీసుకున్నాడట. రాత్రి జైలులోని తన గదిలో ఇటూ అటూ పొర్లుతూ ఉండిపోయాడని వార్తలు వచ్చాయి. రాత్రి పూట నిద్ర పట్టక కొన్ని సార్లు లేచి కూర్చున్నాడట.

జైలుకు తీసుకుని వస్తుండగా మధ్యలో సంజయ్ దత్ ఏడ్చినట్లు ఆయన వెంట ఉన్న గార్డు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సంజయ్ దత్‌ను పూణేలోని యెరవాడ జైలుకు పంపుతారని భావిస్తున్నారు. అయితే, అధికారులు ఈ విషయంపై మాట్లాడడం లేదు.

సంజయ్ దత్‌కు ఇంటి భోజనాన్ని అధికారులు నెల పాటు అనుమతించారు. చాప, చిన్నపాటి దిందు వాడడానికి కూడా సంజయ్ దత్‌కు అనుమతించినట్లు సమాచారం. తాను చేతులు జోడించి జైలుకు వస్తున్నానని, తాను లగ్జరీ కోరడం లేదని, కనీస సౌకర్యాల కోసం విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన వాటిని వాడడానికి కోర్టు అనుమతి కోరారు. నెలపాటు వాటిని కోర్టు అనుమతించింది. జైలు మాన్యువల్ ప్రకారం ఆయనకు చికిత్స అందించనున్నారు.

English summary
According to media reports - Bollywood star Sanjay Dutt spent a sleepless night in Mumbai’s Arthur Road Jail after he surrendered to serve the remaining 42 months prison term. He was convicted in the 1993 Mumbai blasts case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X