హరీష్ రావుకు కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత అండ

తమ కుటుంబం, పార్టీ హరీష్ రావుకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె చెప్పారు. తెలంగాణ ఉద్యమంపై ఇలాంటి కుట్రలు ఎన్నో జరిగాయని, ఇంకా జరుగుతాయని ఆమె అన్నారు. ఆ కుట్రలను ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు.
పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన రఘునందన్‌రావు సీమాంధ్రుల ఏజెంట్‌గా మారి ఆరోపణలు చేస్తున్నారని, ఇది తెలంగాణ ఉద్యమంపై దాడి చేయటమేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు టి.హరీశ్‌రావు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రవణ్‌కుమార్, రామ్మోహన్‌లతో కలిసి శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
"పద్మాలయ స్టూడియో వ్యవహారంలో నేను డబ్బులు తీసుకున్నానని ఆరోపించావు కదా. దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆధారాలు బయటపెట్టు. వెంటనే సీబీఐ జేడీకి అందజేయి'' అని హరీశ్ సవాల్ చేశారు. "పద్మాలయ స్టూడియోపై మేం వేసిన పిటిషన్‌పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎలాంటి కట్టడాలు నిర్మించవద్దని ఆదేశించింది. ప్రభుత్వం చేయాల్సిన పని మేం చేశాం. ఈ అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించాం. నా జీవితంలో రాజీ అనేది లేదు. చివరిదాకా పోరాడతా'' అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications