శ్రీశాంత్‌తో బాబు పోలిక: జగన్ పార్టీ నేత అరెస్టు

ఫ్లెక్సీలలో ఇతర పార్టీల నేతలను, సినిమా హీరోలను, క్రికెటర్‌లను ఉపయోగించుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన కూడా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర దుమారం రేపింది. ఇన్నాళ్లు వారిని తమ వారిగా చెప్పుకున్న జగన్ పార్టీ.. తాజాగా మాత్రం చంద్రబాబును విమర్సించేందుకు ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది.
చంద్రబాబుతో పాటు ఐపిఎల్ 6లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్ ఫోటోను పెట్టి.... ఐపిఎల్‌లో పేసర్ శ్రీశాంత్ ఫిక్సర్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఫిక్సర్ అని రాశారు. ఇది స్థానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత చిన్నప రెడ్డి ఏర్పాటు చేశారు. వెన్నుపోటుదారుడు అని, పొలిటికల్ ఫిక్సింగ్ డాన్ అని, కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని ఈ కుమ్మక్కుకు అంతం లేదా అని, కాంగ్రెసుతో కలిసి దుష్టపాలన సాగిస్తున్నారని అందులో రాశారు. విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీ వద్దకు చేరుకొని నిరసనలు తెలిపారు.
ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వారిని చితకబాదారు. ఇంకోసారి ఇలాంటి చీఫ్ ట్రిక్స్‌కు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. కాగా, ఇటీవలి వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పలు ప్రాంతాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు, వైయస్ రాజశేఖర రెడ్డిల ఫోటోలతో పాటు హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఫోటోలను తమ ఫ్లెక్సీలలో ఉపయోగించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications