అమ్మాయి అసభ్యకర ఫోటోలు ఫేస్‌బుక్‌లో పెట్టించిన గర్ల్

Student arrested for uploading girl photos in facebook
ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని చీరాలలో ఇద్దరు విద్యార్థినుల మధ్య వివాదం అసభ్యకర ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టే వరకు వెళ్లింది. చీరాలలోను ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ విద్యార్థి అశ్లీల వెబ్ సైట్ క్రియేట్ చేయడంతో పాటు ఫేస్‌బుక్‌లో ఆమెకు సంబంధించిన చిత్రాలను ఉంచాడు.

బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో వేటపాలెం పోలీసులు సంతోష్ అనే విద్యార్థిని అరెస్టు చేశారు. అశ్లీల చిత్రాలను పెట్టడానికి కారణమైన ప్రధాన సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు విద్యార్థునుల మధ్య వివాదం కారణంగా అందులో ఓ యువతి బాధితురాలి ఫోటోను తన స్నేహితుడితో వెబ్ సైట్లో పెట్టించింది.

బ్యాంకులో అగ్ని ప్రమాదం

మెదక్ జిల్లా చేగుంట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. కార్యాలయంలోని కంప్యూటర్లు, రికార్డులు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద ఈ ఉదయం కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించి దర్యాఫ్తు చేపట్టారు.

అనంతపురంలో హౌసింగ్ బౌర్డు కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాలనీలో నివాసముంటున్న మహబూబ్ పాషా తన భార్య, కుమారునితో కలిసి ఉరివేసుకొని చనిపోయాడు. మూడు రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+