బాబుకు కాంగ్రెస్ షాక్: ధర్మాన, సబిత బల ప్రదర్శన!

Chandrababu Naidu
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులందరూ రాజీనామా చేయాల్సిందేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కళంకిత మంత్రులు రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి ఆమోదించక పోవడం సరికాదన్నారు. కళంకితులంతా రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. చంద్రబాబు ఈ రోజు రాష్ట్రపతిని కలిసి కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. కాగా చంద్రబాబు రాష్ట్రపతిని కలవడం కంటే ముందే కాంగ్రెసు పార్టీ అధిష్టానం అభియోగాలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావులచే రాజీనామా చేయించి టిడిపికి షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు.

మాజీ పిసిసి అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్ సోమవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మరికొద్ది సేపట్లో గవర్నర్‌ను కలువనున్నారు. ధర్మానతో మంత్రి కొండ్రు మురళీ భేటీ అయ్యారు.

ధర్మాన, సబితల బలప్రదర్శన

రాజీనామాలు చేసిన ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిల రాజీనామాలు ఆమోదించవద్దని, వారి రాజీనామాలు ఆమోదిస్తే ఊరుకునేది లేదని, వారు ఏ తప్పు చేయలేదని శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన అనుచరులు, రంగారెడ్డి జిల్లాలో సబిత అనుచరులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.

రాజీనామా తర్వాత తీవ్ర అసంతృప్తితో ఉన్న ధర్మాన ప్రసాద రావు మంగళవారం నాటి తన పుట్టిన రోజు వేడుకల నేపథ్యంలో ఆ పేరుతో బల ప్రదర్శన చేయాలని భావిస్తున్నారట. శ్రీకాకుళం జిల్లాలో తాను లేకుంటే కాంగ్రెసు పార్టీ లేదనే హెచ్చరికను అధిష్టానానికి చేయనున్నారని తెలుస్తోంది. ధర్మానకు జిల్లాకు చెందిన నేతలు అండగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ అండ ఉందని చెబుతున్నారు. మరోవైపు సబిత ఇంద్రా రెడ్డి అనుచరులు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+