సిఎంల పేర్లు చెప్పి బెదిరించిన శ్రీశాంత్: వెంట హీరోయిన్

పోలీసు అధికారి గుర్తింపు కార్డు చూపించినా శ్రీశాంత్ తగ్గలేదు. అరెస్టు చేసేందుకు వచ్చామని చెప్పినా పోలీసు వాహనం ఎక్కేందుకు అంగీకరించలేదు. వాగ్వాదానికి దిగాడు. తప్పించుకునేందుకు పెనుగులాడాడు. అరెస్టు ఎందుకో చెప్పాలని ప్రశ్నించాడు. చెప్పవద్దని తమకు ఆదేశాలున్నాయని పోలీసులు అధికారులు చెప్పారు.
ఆ తర్వాత కాసేపటికి అతనిని అదుపులోకి తీసుకున్నామని, అనంతరం అతనిని మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లినట్లు చెప్పారు. అక్కడ అప్పటికే అరెస్టై ఉన్న బుకీలు, అతని స్నేహితుడు జిజును చూసి శ్రీశాంత్ ఆశ్చర్యానికి లోనయ్యాడని, అతనికి అప్పటికే అర్థమైపోయిందని అధికారులు చెబుతున్నారు.
కాగా, శ్రీశాంత్ నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో మోడళ్ల చిత్రాలు, హీరోయిన్ కావాలనుకుంటున్న అమ్మాయిల వివరాలున్నాయని సమాచారం. శ్రీశాంత్‌ను అరెస్టు చేయడానికి వెళ్లిన సమయంలో అతడితో పాటు ఓ మరాఠీ హీరోయిన్ ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధముందా లేదా అన్ని విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు శ్రీశాంత్ ఎక్కడ ఉంటే అక్కడే బుకీ జిజు జనార్ధన్ ఉండేవాడట. అతడు దాదాపు శ్రీశాంత్‌కు ఉపగ్రహంగా చెప్పుకోవచ్చునని చెబుతున్నారు కేరళ క్రికెట్ సంఘం కార్యదర్శి టిసి మాథ్యూ. జిజు.. శ్రీశాంత్‌కు ఉపగ్రహంలానే ఉండేవాడని, కేరళలోనే కాకుండా శ్రీశాంత్ విదేశాలకు వెళ్లినా అతనికి తోడుగా వెళ్లేవాడు అని మాథ్యూ చెప్పాడు. మరోవైపు మాజీ రంజీ ఆటగాడితో పాటు మరో ఇద్దరు బుకీలను పోలీసులు ఔరంగాబాదులో అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications