కడప మంత్రులకు ఉద్వాసనే?: డిఎల్, సిఆర్ యత్నాలు

C Ramachandraiah - DL Ravindra Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులను బయటకు పంపించాలని చూస్తున్నారట. కిరణ్ చాలా రోజుల నుండి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ ప్రస్తావన ఆయన తీసుకు వచ్చారు. తాజాగా సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావుల రాజీనామాలను ఆమోదిస్తే పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఉండవచ్చు.

ఒకవేళ అధిష్టానం అంగీకరిస్తే ముఖ్యమంత్రి తన కేబినెట్లోకి తనకు అనుకూలురైన వారిని తీసుకొని, తనను టార్గెట్ చేసుకుంటున్న వారిని పక్కన పెట్టాలని భావిస్తున్నారు. అదే జరిగితే మిగతా మంత్రుల పరిస్థితి ఏమో కానీ... కడప జిల్లాలోని ముగ్గురు మంత్రులకు ఎసరు తప్పదంటున్నారు. ప్రస్తుతం కడప జిల్లా నుండి అహ్మదుల్లా, డిఎల్ రవీంద్రా రెడ్డి, సి.రామచంద్రయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

వీరి ముగ్గురిని కిరణ్ బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి పైన కిరణ్ ఎప్పటి నుండో ఆగ్రహంతో ఉన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా డిఎల్ ముఖ్యమంత్రి పైన నిప్పులు చెరుగుతున్నారు. పథకాల నుండి మొదలు ప్రతి అంశంలో ఆయనను టార్గెట్ చేసుకుంటున్నారు. దీంతో గత విస్తరణలో ఆయన మంత్రి పదవికి కోత పడింది. అప్పుడే ఆయనను తొలగించాలని భావించినా అది ఫలించలేదు.

లేదంటే శంకర రావులాగే అప్పుడే డిఎల్ పైన వేటు పడేది. ఇప్పుడు ఎలాగైనా ఆయనకు ఉద్వాసన పలుకాలని కిరణ్ భావిస్తున్నారు. జిల్లాకు చెందిన మరో మంత్రి సి.రామచంద్రయ్యను కూడా పంపించాలని చూస్తున్నారు. అతనిని మంత్రివర్గంలోకి తీసుకోవడం కిరణ్‌కు ఏమాత్రం ఇష్టం లేదట. అయితే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వర్గం నేత కావడంతో ఆయన కారణంగా మంత్రి పదవి వచ్చింది.

సి.రామచంద్రయ్య చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చిరు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా చిరు వర్గం నేతగా పలుమార్లు కిరణ్‌కు తన అసంతృప్తిని తెలియజేశారు. ఈ నేపథ్యంలో అతని పైనా వేటు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరో మంత్రి అహ్మదుల్లా పట్ల కిరణ్‌కు ఎలాంటి కోపం లేకున్నప్పటికీ ఇటీవలె ఎమ్మెల్సీ అయిన షబ్బీర్ అలీని మంత్రివర్గంలోకి తీసుకోవాలని పెద్దల నుండి ఒత్తిళ్లు వస్తున్నాయట.

దీంతో షబ్బీర్ కోసం అహ్ముదుల్లాను ఇంటికి పంపించాలని చూస్తున్నారట. మరోవైపు ఎప్పటి నుండో కేబినెట్లోకి రావాలని చూస్తున్న వీరశివా రెడ్డికి అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇదిలా ఉండగా డిఎల్ రవీంద్రా రెడ్డి, సి.రామచంద్రయ్యలు ఎవరికి వారు ఉద్వాసన జరుగకుండా ప్రయత్నాలు చేస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+