పట్టించుకోవట్లేదు, పార్టీలోనే ఉంటా: అధిష్టానంపై పొన్నం

కాంగ్రెస్‌లోనే పొన్నం: విహెచ్
తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వేరుగా చెప్పారు. మంత్రులు రాజీనామా చేసి తమ సచ్ఛీలతను నిరూపించుకోవాలని ఆయన కోరారు. సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు రాజీనామాల విషయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చూసుకుంటారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
చివరి వరకు ఒత్తిడి: వివేక్
తెలంగాణ కోసం తమ పార్టీ అధిష్టానం పైన చివరి వరకు ఒత్తిడి తేవాలనేదే తమ ఆలోచన పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ అన్నారు. తెలంగాణ కోసం తాము ఉద్యమిస్తానమన్నారు.
యూపిఏ ద్వారానే తెలంగాణ: గుత్తా
యూపిఏ ద్వారానే తెలంగాణ వస్తుందని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం నల్గొండ జిల్లాలో అన్నారు. తెలంగాణ వచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన విషయం తనకు తెలియదన్నారు. ఎందుకు కలిశారో తెలియదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications