విజయమ్మను అడ్డుకున్న ఎమ్మెల్యే, తెలంగాణవాదులు

YS Vijayamma
అదిలాబాద్/నల్గొండ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ కాన్వాయ్‌ను పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అదిలాబాదులోని సిర్పూర్ పేపర్ మిల్లు వద్ద తెలంగాణవాదులు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వేంపల్లి వద్ద కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు.

వారిని పోలీసులు అడ్డుకొని ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా తెలంగాణవాదులు నినాదాలు చేశారు. అంతకుముందు విజయమ్మ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాజెక్టు సైడ్‌ను సందర్శించేందుకు హైదరాబాదు నుండి మంగళవారం ఉదయం బయలుదేరారు. ఆమె ఎపి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. ఉదయం పదకొండున్నరకు ఆమె కాగజ్ నగర్ చేరుకున్నారు.

ఈ సమయంలో ఆమె రోడ్డు మార్గం గుండా వెళ్తుండగా సిర్పూర్ పేపర్ మిల్లు వద్ద అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. విజయమ్మ వెంట మాజీ మంత్రి, వరంగల్ జిల్లా నేత కొండా సురేఖ ఉన్నారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా వస్తే అడ్డుకుంటామని తెలంగాణవాదులు ఇప్పటికే హెచ్చరించారు.

యూపిఏ ద్వారానే తెలంగాణ: గుత్తా

యూపిఏ ద్వారానే తెలంగాణ వస్తుందని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం నల్గొండ జిల్లాలో అన్నారు. తెలంగాణ వచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన విషయం తనకు తెలియదన్నారు. ఎందుకు కలిశారో తెలియదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+