నాతో గడుపుతావా లేదా: తాగొచ్చి మహిళకు బెదిరింపు

Woman harassed in Guntur
గుంటూరు: వడ్డీ వ్యాపారుల అరాచకాలు మితిమీరుతున్నాయి. అప్పుగా ఇచ్చిన డబ్బును వసూలు చేసుకోవడానికి వారు ఎంతకైనా తెగిస్తున్నారు. దాడులకు దిగడమే కాకుండా.. భార్యను పంపించాలని హెచ్చరిస్తున్నారు. గుంటూరు జిల్లాలో వడ్డీ వ్యాపారుల మరో అరాచకం వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని కొత్తపేటలో ఓ వ్యక్తి తోపుడు బండిపై ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు వ్యాపారం నిమిత్తం మధ్యవర్తి ద్వారా ఓ వ్యక్తి వద్ద వడ్డీకి అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చమని లేదంటే కిడ్నీలు అమ్ముకోమని వడ్డీ వ్యాపారి, మధ్యవర్తులు కొద్దిరోజులుగా అప్పు తీసుకున్న వ్యక్తిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇ క్రమంలో అతడు ఇల్లు వదిలి పారిపోయాడు.

దీంతో వడ్డీ వ్యాపారులు అతని భార్యను డబ్బు కోసం పీడించడం ప్రారంభించారు. బాకీ తీర్చలేకుంటే తమతో గడపాలని లేదంటే కిడ్నీలు అమ్ముకోవాలని కొద్ది రోజులుగా ఆమెను కూడా ఒత్తిడికి గురిచేశారు. భర్త ఎలాగు వెళ్లిపోయాడని, తనతో ఉంటే కుటుంబాన్ని పోషిస్తానని, పిల్లల పేరిట రూ.లక్ష ఇస్తానని స్పష్టం చేశారు.

అర్దరాత్రులు తాగివచ్చిన వారు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు తన ఇరువురు కుమార్తెలతో సోమవారం అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+