వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశాంత్ లైఫ్ ఆధారంగా సినిమా: ఐపిఎల్ బ్యాన్‌పై సుప్రీం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sreesanth
ఎర్నాకులం: ఐపిఎల్ 6లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన కేరళ పేసర్ శ్రీశాంత్ జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. శ్రీశాంత్ సహా అజిత్ చండిలా, అంకిత్ చవాన్‌లు ఇటీవల స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన విషయం తెలిసిందే. శ్రీశాంత్ కేరళ క్రికెటర్.

అతని జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమాను రూపొందించాలని మలయాళం ఫిల్మ్ మేకర్స్ షాజీ కైలాస్, ఎకె సాజన్‌లు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి క్రికెట్ అని పేరు పెట్టనున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి ఇరువురి మధ్యన ప్రాథమిక స్క్రిప్ట్ డిస్కషన్స్ కూడా జరిగాయట.

సాజన్ ఈ చిత్రానికి రచయిత కాగా షాజీ కైలాస్ దీనికి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. షాజీ ఎకలవ్యన్, మాఫియా వంటి చిత్రాలను ఇదివరకు తెరకెక్కించారు. ఈ చిత్రాలు కేరళ, కర్నాటక అండర్ వరల్డ్‌కు సంబంధించిన ఆపరేషన్ చిత్రాలు. ఇందులో శ్రీశాంత్ వంటి కుర్రాడు ఎదిగిన తీరు, అంతలోనే ఫిక్సింగ్‌లో అరెస్టైన అంశాలను పెట్టనున్నారని తెలుస్తోంది.

కాగా, శ్రీశాంత్ సహా అరెస్టైన క్రికెటర్లను, బుకీలను పోలీసులు ఈ రోజు కోర్టులో హాజరు పర్చనున్నారు. శ్రీశాంత్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఐపిఎల్‌ను నిషేధించాలని, ఇది దేశ అంతర్గత భద్రతకు ముప్పని దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

ఐపిఎల్‌ను నిషేధించాల్సిన అవసరం లేదు: సుప్రీం

ఐపిఎల్‌ను నిషేధించాలన్న పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. ఒకరిద్దరు తప్పు చేసినంత మాత్రాన ఐపిఎల్‌ను నిషేధించాల్సిన అవసరం లేదని చెప్పింది. నిందితులపై బిససిఐ చర్యలు తీసుకోవాలని, రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

English summary
Within days after three Team Rajasthan cricketers — the most prominent being S Sreesanth — were arrested for their alleged involvement in the betting racket, Malayalam filmmakers Shaji Kailas and A K Sajan are gearing up for a film titled Cricket, which is loosely based on Sreesanth's life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X