వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిక్సింగ్: శ్రీశాంత్ ఎస్కార్స్ట్ బెంగళూర్ అమ్మాయిలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sreesanth
బెంగళూర్: స్పాట్ ఫిక్సింగ్‌లో పోలీసులకు చిక్కినప్పుడు క్రికెటర్ శ్రీశాంత్ వెంట ఉన్న ఇద్దరు అమ్మాయిలు కూడా బెంగళూర్‌కు చెందినవారని తెలుస్తోంది. గతవారం శ్రీశాంత్‌ను ఢిల్లీ పోలీసులు వెంటాడి అరెస్టు చేశారు. ఆ సయమంలో అతని వెంట ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారిద్దరు కూడా బెంగళూర్‌కు చెందినవారని తెలుస్తోంది.

ఒక అమ్మాయిది రిచర్డ్స్ టౌన్‌ అని, మరో అమ్మాయిది రిచ్మండ్ టౌన్ అని చెబుతున్నారు. ఈ అమ్మాయిలు శ్రీశాంత్‌ను అనుసరించడమే కాకుండా అతని కదలికలను బుక్కీలుగా అనుమానిస్తున్న తమ బాస్‌లకు చేరవేసేవారని చెబుతున్నారు.

బుక్కీలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా క్రికెట్‌ను ప్రేమించే అమ్మాయిలను ట్రాక్ చేయడానికి సాంకేతిక నిపుణులను వాడుతారని, ఆ అమ్మాయిలను ఎస్కార్ట్ గర్ల్స్‌గా వాడుతారని అంటున్నారు. ఎస్కార్ట్ గర్ల్స్ నిజానికి కాల్ గర్ల్స్ కాదు. క్రికెట్ పిచ్చితో క్రికెటర్లతో సమయం గడపడానికి సుముఖత వ్యక్తం చేస్తారని, తమకు తెలియకుండానే బుక్కీల వలలో పడుతారని చెబుతున్నారు.

ఎస్కార్ట్ గర్ల్స్‌కు పెద్ద యెత్తున సొమ్ము ముట్టజెప్పడమే కాకుండా హోటళ్లలో వసతి కూడా కల్పిస్తారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో పోలీసులు శ్రీశాంత్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అంకిత్ చవాన్, అజిత్ చండిలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

English summary

 The two 'escort girls' accompanying him when Delhi police arrested Sreeshanth in Mumbai last week, are from Bangalore, highly placed police sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X